Monday, November 18, 2024

బెంగళూరు సైంటిస్టుల ఘనత.. మనిషిలో బుర్రలో ఏముందో చెప్పేస్తోంది

1991లో వచ్చిన ఆదిత్య 369 చిత్రం మీకు గుర్తుందా? సైన్స్‌ఫిక్షన్‌, సోషియో-ఫాంటసీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో టైమ్‌ మిషన్‌లో లోపం కారణంగా పొరపాటున భవిష్యత్‌లోకి వెళ్లిన తర్వాత.. సుత్తివేలు మనసులో అనుకునే మాటలను అక్కడి ఓ పరికరం ఆయన గొంతుతోనే ధ్వన్యనుకరణ చేసి చెప్పేస్తుంది. అచ్చంగా అలాంటి పరికరాన్నే తయారు చేశారు బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్ఆర్‌) శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) పరిజ్ఞానంతో పనిచేసే ఈ పరికరంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారు.

మనిషి మెదడులో ఉండే న్యూరాన్లలోని యాక్సాన్‌-డెండ్రిటీస్‌ను ఈ పరికరం విశ్లేషిస్తుంది. మెదడులోని సినాప్స్‌ అనే కలోసల్‌ జంక్షన్లు, వాటిలో నిక్షిప్తమై ఉండే విషయాలను బయో-న్యూట్రల్‌ నెట్‌వర్క్‌ ద్వారా సంగ్రహిస్తుంది. సాఫ్ట్‌వేర్‌లో ఉండే ఆర్టిఫిషియల్‌ న్యూట్రల్‌ నెట్‌వర్క్‌(ఏఎన్‌ఎన్‌) అందుకు సహకరిస్తుంది. మనిషి మెదడులోని భావాలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌ సంకేతాలను ఏఎన్‌ఎన్‌, ఆర్టిఫిషియల్‌ సినాప్టిక్‌ నెట్‌వర్క్‌(ఏఎస్ఎన్) సంగ్రహించి.. ఏఐ ద్వారా వాయి్‌సగా మారుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement