మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు రూపొందించిన నాసా అంతరిక్ష ఆర్టెమిస్ 1 ఓరియన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది భూమి నుంచి 4,19,378 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. గతంలో అపోలో 13 మిషన్ భూమి నుంచి 2,48,655 మైళ్లు ప్రయాణించింది. ఆ రికార్డును ఆర్టెమిస్ బ్రేక్ చేసింది. మరో ఆరు రోజుల పాటు ఓరియన్ చంద్ర కక్ష్యలోనే ఉంటుంది. ఇది అంతరిక్ష నౌకను భూమికి తిరిగి వచ్చే పథంలో ఉంచుతుంది. తరువాత డిసెంబర్ 11 ఆదివారం పసిఫిక్ మహాసముద్రంలో స్ల్పాష్‌డౌన్ అవుతుంది అని నాసా ప్రకటన తెలిపింది.. ”ఈ రోజు, నాసా ఓరియన్ స్పేస్‌క్రాప్ట్ మానవులను లోతైన అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి, సురక్షితంగా భూమికి తిరిగి రావడానికి రూపొందించిన అంతరిక్ష నౌక సుదూర దూర రికార్డును బద్దలు కొట్టింది.
ఈ రికార్డు ప్రస్తుతం అపోలో 13 పేరిట ఉంది. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మరింత తెలుసుకోవడానికి ఆర్టెమిస్ వినూత్న చర్యలను ఉపయోగిస్తుందని భావిస్తున్నారు. కక్ష్యలో ఉన్న గేట్‌వే స్పేస్ స్టేషన్ సహాయంతో చంద్రుని ఉపరితలాన్ని అర్థం చేసుకోవడానికి నాసా ప్రయత్నిస్తుంది. ఈ వ్యోమనౌకకు కమాండర్ మూనికిన్ కాంపోస్ అనే సెన్సార్‌ని జోడించారు. విమానంలో సిబ్బంది ఎలాంటి అనుభవాన్ని అనుభవించవచ్చనే సమాచారాన్ని అందించడంలో ఇది సహాయపడుతుంది. అపోలో 13ని సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఆర్టురో కాంపోస్ పేరు మీద కాంపోస్ అని నామకరణం చేశారు.