Sunday, September 8, 2024

PM Modi – యుద్ధం ఆపేద్దాం! ర‌ష్యాకు శాంతి సందేశం –

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో భార‌త ప్ర‌ధాని కీల‌క భేటీ
ఉక్రెయిన్‌తో యుద్ధంపై అభిప్రాయాల వెల్ల‌డి
ర‌ష్యా, ఆస్ట్రియాలో ముగిసిన మోదీ ప‌ర్య‌ట‌న‌
రెండు దేశాల ప్ర‌ధానుల‌తో విస్తృత చ‌ర్చ‌లు
ఇరు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు బ‌లోపేతం
ఉక్రెయిన్‌, ర‌ష్యా శాంతి ప్ర‌క్రియ‌లో భార‌త్ కీల‌కం
మోదీ తీరును ప్ర‌శంసించిన ఆస్ట్రియా చాన్స్‌ల‌ర్‌
త‌మ‌దేశం త‌ట‌స్థంగా ఉంటుంద‌న్న క‌ర్ల్ నెహ‌మ్మార్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. ఈ నెల 8, 9 తేదీల్లో రష్యాలో పర్యటించిన ఆయ‌న‌.. తర్వాత రెండు రోజులు ఆస్ట్రియాలో పర్యటించారు. తాజాగా రెండు దేశాల పర్యటన ముగించుకొని ప్ర‌ధాని భారత్‌ చేరుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు మాస్కోలో మోదీ రెండు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి మోదీకి పుతిన్‌ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. రెండో రోజు ఇద్దరు నేతలు విస్త్రృత చర్యలు జరిపారు. రష్యా అధ్యక్షుడి ముందు ఉక్రెయిన్‌ యుద్ధంపై మోదీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఉక్రెయిన్‌, ర‌ష్యా శాంతి ప్ర‌క్రియ‌లో భార‌త్ కీల‌కం..

ఇక.. మాస్కో పర్యటన అనంతరం ప్ర‌ధాని ఆస్ట్రియాలో ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఆ దేశ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, రష్యా శాంతి ప్రక్రియలో భారత్‌ ఎంతో ప్రధానమైనదని, అది శక్తివంతమైన ప్రభావవంతమైన పాత్రను పోషించగలదని కర్ల్‌ నెహమ్మార్‌ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని చెప్పారు.

41 ఏండ్ల త‌ర్వాత ఆస్ట్రియాకి..

- Advertisement -

భారత ప్రధాని ఆస్ట్రియా పర్యటకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. 1983లో చివరిసారిగా ఇందిరా గాంధీ ఆ దేశాన్ని సందర్శించారు. ఇందిరా గాంధీ అనంత‌రం సుదీర్ఘ కాలం తర్వాత ఆ దేశంలో పర్యటించిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం ప్రారంభమై 75 ఏండ్లు పూర్తయ్యాయని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement