Sunday, November 17, 2024

కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనం.. దేశవ్యాప్తంగా వర్షపాతం యథాతథం ఐఎండీ

కేరళ రాష్ట్రంలోనికి నైరుతి రుతుపవనాలు జూన్‌ 8న ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. జూన్‌ 1న రావాల్సిన రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షపాతానికి ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొంది. అలాగని దేశంలోని మిగతా ప్రాంతాలకు రుతు పవనాలు ఇంతే ఆలస్యం కాకుండా కాస్త ముందుగానే చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకకు సంకేతంగా కేరళలో వేర్వేరు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి.


అంతకుమునుపు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో వాయుగుండం, దాని తీవ్రత కారణంగా వచ్చే రెండు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాల చేరుకుంటాయని జూన్‌ 5న ఐఎండీ సూచించింది. జూన్‌ 8 లేదా 9 తేదీల్లో నైరుతి రుతుపవనాలు వస్తాయని ప్రైవేట్‌ వాతావరణ ఏజెన్సీ స్కయ్‌మెట్‌ వెదర్‌ పేర్కొంది. అయితే రుతుపవనాలు ప్రవేశించేటప్పుడు కేవలం తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement