కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిషిత్ ప్రామాణిక్‌కు బెంగాల్‌లోని జిల్లా కోర్టు షాకిచ్చింది. 2009నాటికి ఓ చోరీ కేసులో అరెస్టు వారెంట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే… అలీపూర్ దువార్ జిల్లాలో నగల చోరీ ఘటనకు సంబంధించి కేసు నిందితుల్లో నిషిత్ ప్రామాణిక్ ఒకరు. ఈ కేసు విచారణకు ఇతర నిందితులు అంతా కోర్టుకు హాజరుకాగా, నిషిత్ ప్రామాణిక్ తరపు న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో నిషిత్‌పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే అరెస్ట్ వారెంట్‌కు సంబంధించి పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిషిత్ ప్రామాణిక్ తృణమూల్ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయి బాధ్యుడిగా పనిచేస్తుండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలతో మమతాబెనర్జీ ఆయనపై వేటువేసింది. దీంతో 2019లో బీజేపీలో చేరారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలుపొంది కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement