ములుగు, ప్రభన్యూస్ : అంతర్ రాష్ట్ర పులుల చర్మ స్మగ్లర్లను విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్సంగ్ పాటిల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ వెల్లడించిన వివరాల ప్రకారం వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పద స్థితిలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసున్న నిందుతులలు వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన పూనెం విఘ్నేష్. సోయం రమేష్, సోడి చంటి, ఏటూరునాగారం మండలంలోని గోగుపల్లి గ్రామానికి చెందిన చిర శ్రీను, టేకుల పల్లి మండలంలోని చింతన్లంక గ్రామానికి చెందిన చింతల బాలకృష్ణలుగా గుర్తించారు. జగన్నాధపురం వై జంక్షన్లో పులిచర్మాన్ని అమ్మేందుకు తీసుకెల్తూ పట్టుపడ్డ ఆ నిందుతులని ఏటూరునాగారం ఎఫ్ డీఓ గోపాల్రావు సమక్షంలో అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి పెద్దపులి చర్మంతో పాటు రెండు టూ వీలర్లు, మూడు సెల్ఫోన్స్ స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital