Friday, November 22, 2024

Bengaluru: రామేశ్వ‌రం బ్లాస్ట్ లో కీల‌క నిందితుల అరెస్ట్…

గ‌త 40 రోజులుగా అజ్ఞాతంలో నిందితులు
క్యాప్ కొంటూ ఎన్ఐఏకు చిక్కారు
ఈ ఇద్ద‌రి నేర‌చ‌రిత చిట్టా పెద్ద‌దే
ఆయుధ వినియోగ శిక్ష‌ణ‌లోను ప్ర‌వీణులే

బెంగ‌ళూరు – దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో మరో కీలక అడుగు పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి మతీన్ తాహాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. రామేశ్వరంలో బ్లాస్ట్ జరిగినప్పటి నుంచీ పరారీలో ఉన్న ఇద్దరూ అస్సాం, పశ్చిమబెంగాల్ లో దాక్కున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.

ఈ కేసులో నిందితులను ఒక క్యాప్ పట్టించింది. నిందితులు క్యాప్ కొనేందుకు ఒక షాప్ కు వెళ్లగా.. అక్కడి సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని గుర్తించారు. తరచూ సిమ్ కార్డులను మార్చుతూ పోలీసులకు దొరక్కుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లేందుకు ప్రయత్నించినా రాడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోయారు. ఈ కేసులో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న నిందితుడు.. గతంలో శివనసముద్రం, గుండ్లుపేట, తమిళనాడులోని కృష్ణగిరి ఫారెస్ట్ విభాగంలో కొందరికి ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది.

- Advertisement -

ఇదిలా ఉంటే … ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరులో జరిగిన బాంబు పేలుడులో 9మంది గాయపడ్డారు. నిందితుడు ఇడ్లీ తిని.. తన చేతిలోని బాంబు బ్యాగ్ ను అక్కడే వదిలివెళ్లాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. ఆ సమయంలో నిందితుడు టోపీ ధరించి ఉన్నాడు. ఆ టోపీ ఆధారంగా దర్యాప్తు చేసిన బృందాలు అతను కొనుగోలు చేసినప్పటి దృశ్యాలను కనుగొన్నారు. వాటి ఆధారంగానే నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement