కొలంబో : మాజీ ప్రధాని మహింద రాజపక్సేతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేయాలని కొలంబో కోర్టు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)ని ఆదేశించింది. స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు గొటబాయ సహా అధికారపక్షం గద్దెదిగాలని కోరుతూ రాజధానిలో రెండునెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
అల్లర్లు జరిగిన ప్రాంతంలోని ఈ కోర్టులో పిటిషన్ దాఖలవడం విశేషం. మరోవైపు ట్రింకోమలీలోని పోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టులోనూ కేసు దాఖలైన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని మహింద సహా ఆయన తనయుడు, మరో 17మంది దేశం విడిచివెళ్లరాదని, అల్లర్లలో వీరిపాత్రపై విచారణ జరపాలని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..