Saturday, November 23, 2024

టెట్‌కు ఏర్పాట్లు పూర్తి.. 2683 సెంటర్లలో పరీక్ష రాయనున్న 6.29 లక్షల మంది అభ్యర్థులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 12వ తేదీన రాష్ట్రంలో జరిగే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌ టెట్‌) నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. పేపర్‌-1కు 3,51,468 మంది, పేపర్‌-2కు 2,77,884 మంది అభ్యర్థులు రాయనున్నారు.

పేపర్‌-1కు 1480, పేపర్‌-2కు 1203 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి మంగళవారం తెలిపారు. 33 జిల్లాలకు కలిపి మొత్తం 2683 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లలో తప్పులు దొర్లితే సరిచేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement