తెలంగాణతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ అంటే ఫుల్ పాలోయింగ్ ఉంది. భారత రాష్ట్ర సమితి రెండో భారీ బహిరంగ సభ మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరగనుంది. ఫిబ్రవరి 5న నిర్వహించే ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల బృందం మంగళవారం నాందేడ్ తరలి వెళ్లింది. సభ కోసం నాందేడ్ నగరంలో న్యూ ముండా మార్కెట్ కమిటీ మైదాన్ ను ఎంపిక చేశారు.
తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆదిలాబాద్, ఆర్మూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, జీవన్ రెడ్డి, షిండే, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లుతో పాటు పలువురు సభ నిర్వహించే మైదానం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించగా.. రెండో సభ మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ సభకు ప్రాధాన్యం సంచరించుకుంది.