బంజారాహిల్స్, (ప్రభన్యూస్) : ప్రముఖ నగల ప్రదర్శన కర్టెన్ రైజర్ ఆధ్వర్యంలో ఆర్నికా ప్రీమియం జువెల్లరీ ఎగ్జిబిషన్ జూలై 9,10 న ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హోటల్ పార్క్ హాయత్ వేదికగా రెండు రోజుల పాటు- జరిగే ఈ జువెల్లరీ ప్రదర్శనకు సర్వం సిద్ధం చేశామని సంస్థ ప్రతినిధులు వర్షబాలాజీ తెలిపారు. ప్రముఖ నటి స్పందన పల్లి సహస్రా, ప్రముఖ మోడల్స్ తో అత్యంత వైభవంగా ఈ ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ జంట నగరాల వారికి అందుబాటులో కావాల్సిన అన్ని రకాల మోడల్స్ తో కూడిన జువెల్లరీ ప్రొడక్ట్స్ ప్రదర్శనలో ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి లేటెస్ట్ కలెక్షన్లు గోల్డ్ , డైమండ్, టె-డిషినల్, వెడ్డింగ్ , రంగురాళ్లు, కుందన్, జాదవ్ , పోల్కి తదితర అన్ని బ్రాండ్స్ జువెల్లరీ ప్రొడక్ట్స్ ఒకే వేదికగా అందుబాటు-లో ఉంటాయని, జువెల్లరీ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రానున్న వివాహ, పండుగల శుభకార్యాల కోసం ప్రత్యేకమైనటు-వంటి జువెల్లరీ ఈ ప్రదర్శనలో అందుబాటు-లో ఉంటాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.