అమెరికాలో భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యాన్ని రంగంలోకి దించనుంది. వచ్చే వారం నుంచి 1000 మంది సైనిక వైద్య సిబ్బంది దేశ వ్యాప్తంగా మోహరిస్తామని తెలిపారు. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల ర్యాపిడ్ కిట్లతో పాటు వైరస్ బారినపడకుండా రక్షణ కల్పించేందుకు ఎన్95 మాస్క్‌లను ఉచితంగా అందిస్తామని బైడెన్ ప్రకటించారు. వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందుకే సైనికులను రంగంలోకి దించుతున్నామని వివరించారు.
ఈ నిర్ణయంతో వైద్య వ్యవస్థపై కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఇంకా చాలా మంది టీకా తీసుకోలేదని, వారు ఒమిక్రాన్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటించారు. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. వైద్య సిబ్బంది కరోనా బారినపడటంతో ఐసోలేషన్‌కు వెళ్లారని, దీంతో దేశ వ్యాప్తంగా సిబ్బంది కొరత వేధిస్తున్నదని చెప్పుకొచ్చాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..