శ్శ్రీ విష్ణు హీరోగా విలేజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న అర్జున ఫల్గుణ చిత్రం గురించి సినిమా కథనాయిక అమృత అయ్యర్ కొన్ని విశయాలు షేర్ చేసుకున్నారు..
సినిమా గురించి తన మాటల్లో… స్క్రిప్ట్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది అన్ని రకాల జొనర్లు ఇందులో ఉంటాయి. ఐదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో నేను ఒకరిని. ఫ్రెండ్స్‌కి కష్టం వస్తే సాయం చేసేందుకు ముందుకు వస్తాను. పరిస్థితులు అనుకూలించకపోయినా ఫ్రెండ్ కోసం నిలబడటమనే పాయింట్ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్ అంటే జండర్ చూడకూడదు. అవసరంలో సాయం చేయాలన్నది బాగా నచ్చింది. నా వ్యక్తిగత జీవితంలోను నేను నా స్నేహితులకు సాయం చేశాను. కానీ ఇలా అడవుల్లోకి వెళ్లలేదు. నా వల్ల ఎంత అయిందో అంత చేశాను. అమ్మాయిగా నేను ఎంత చేయగలనో అంత చేశాను. ‘అర్జున్ ఫల్గుణ’ అనేది విలేజ్ డ్రామా. రాజమండ్రిలో జరిగిన యథార్ఘ ఘటన ఆధారంగా తెరకెక్కించారు.
శ్రీ విష్ణు మొదట్లో ఆయన చాలా రిజర్వ్ అని అనుకున్నా. నేను కూడా అలానే ఉంటాను. కానీ ఆ తర్వాత శ్రీవిష్ణు త్వరగా కలిసిపోయారు. ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. మేం ఇద్దరం నటించినట్టు ఉండదు. సహజత్వంగా ఉంటుంది. నేను ఇంకా సినిమా చూడలేదు. రషెస్ మాత్రమే చూశాను. ఈ సినిమాలో సంగీతం బాగుంటుంది. నరేష్ గారి పాత్ర, పోలీస్ కారెక్టర్ ఈ సినిమాలో బాగా ఉంటుంది.
సల్వార్ ధరించి అడవుల్లో పరిగెత్తడం చాలెంజింగ్‌గా అనిపించింది. బాంబ్ బ్లాస్ట్ సీన్లో సెట్లో పొరపాటున బాంబ్ పేలింది. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొండల మీదకు కేరవ్యాన్ రాదు. రాను పోను మూడు గంటల ప్రయాణం. అదొక ట్రెక్కింగ్లా అనిపించింది. రెండు మూడు రోజులు కొండ మీదే షూటింగ్ జరిగింది. అర్జున ఫల్గుణ టీమ్‌లో నన్ను అమ్మాయిలా కాకుండా.. అబ్బాయిలా చూశారు. నేను ఎలా చేయగలను అని అంటే.. మోటివేట్ చేసి మరీ దర్శకుడు నా చేత కొన్ని సీన్లు చేయించారు.
రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. సినిమాల పరంగా సంతృప్తిగా ఉన్నాను. నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశాను అని అనిపించింది. మంచి రివ్యూలు కూడా వచ్చాయి. నాకు సరిపోయే పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. హద్దులనేవి పెట్టుకోలేదు. ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ట్రెడిషనల్ పాత్రలే వస్తున్నాయి. సిటీ అమ్మాయి పాత్రలు చేయాలని ఉంది. గ్లామర్ రోల్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉండదు. ప్రస్తుతం హను మాన్ సినిమాను చేస్తున్నాను.
స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం. మొదటగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫిట్ నెస్ ఎలా మెయింటెన్ చేయాలో నాకు తెలీదు. కానీ ఇప్పుడు పూర్తిగా డైట్ పాటిస్తున్నాను. సినిమాల్లోకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తాను. నాకు హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత అంటే ఇష్టం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital