Sunday, January 5, 2025

TG | దీప్తి జీవన్‌జీకి అర్జున అవార్డు.. అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ !

పారాలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ క్రీడాకారిణి, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవన్‌జీ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపికైనందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ యువ క్రీడాకారులు మరింత రాణించాలని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా సముదాయాలు దోహదపడతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అలాగే క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఏపీ నుంచి అర్జున అవార్డుకు ఎంపికైన జ్యోతి యర్రాజీకి (అథ్లెటిక్స్‌)…. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేశ్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ​​ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లను సీఎం రేవంత్ అభినందించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి 2024లో అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లను ముఖ్యమంత్రి అభినందించారు.

- Advertisement -

దీప్తి జీవన్‌జీకి రూ.కోటి న‌జ‌రానా… గ్రూప్-2 ఉద్యోగం !

కాగా, అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో రాణిస్తున్న యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వ తీసుకొచ్చిన‌ క్రీడా విధానంలో భాగంగా… ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పటికే దీప్తి జీవన్‌జీ కి రూ.1 కోటి, కోచ్ నాగపురి రమేష్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. దాంతో పాటు దీప్తి జీవన్జీకి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వరంగల్ లో 500 గజాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement