Saturday, January 4, 2025

Arjuna Award | తెలుగు తేజాలకు అర్జున అవార్డు..

కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్‌లో జ్యోతి యర్రాజీ, పారా అథ్లెటిక్స్‌లో జీవన్‌జీ దీప్తి అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, జ్యోతి ఏపీలోని విశాఖపట్నం నివాసి.

- Advertisement -

న‌లుగురికి ఖేల్ ర‌త్న‌..

2024 ఏడాదికి గాను గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌లు క‌న‌బ‌రిచిన‌ న‌లుగురు క్రీడాకారుల‌ను ఖేల్ ర‌త్న కోసం ఎంపిక చేసింది. స్టార్ షూట‌ర్ మ‌ను బాక‌ర్‌, వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్ షిప్ విజేత గుకేశ్ కుమార్, పారా అథ్లెట్ ప్ర‌వీణ్ కుమార్, భార‌త హాకీ జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌కు కేంద్రం ఖేల్ రత్న అవార్డును ప్ర‌క‌టించింది.

జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలు తమ సత్కారాలను అందుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement