అర్జెంటీనా కొత్త ప్రెసిడెంట్ జేవియర్ మిలే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ప్రపంచమంతా షాక్ అయ్యే ఫీట్ చేశాడు. ప్రెసిడెంట్ తన స్నేహితురాలితో అందరి ముందు లిప్ లాక్ చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ క్షణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే అధ్యక్షుడు జేవియర్ తన స్నేహితురాలు ఫాతిమా ఫ్లోరెజ్ కచేరీ కోసం రాక్సీ థియేటర్‌కి చేరుకున్నారు. టిక్కెట్టును తన జేబులోంచి చెల్లించినట్లు సమాచారం. వేదికపై తన ప్రియురాలితో రొమాంటిక్ చేయడానికి ముందు, అతను ఒక ప్రసంగం కూడా ఇచ్చారు. ఇందులో అర్జెంటీనాకు రాబోయే కాలం కష్టాలేనని, అయితే దేశం ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఈ జంట బహిరంగంగా ఒకరినొకరు నోటి ముద్దులతో హంగామా చేశారు.. దీనిని సెల్ ఫోన్ లు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దీంతో అధ్యక్షుడిపై ఆ దేశ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.. దేశ పరువు తీశారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు.
ఇక అధ్యక్షుడి స్నేహితురాలు ఫాతిమా ఒక ప్రముఖ హాస్యనటి. తన భర్త నుండి విడిపోయిన తర్వాత ఆమె ఒక టాక్ షోలో జేవియర్‌ను కలుసుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. గత అక్టోబర్‌లో వారిద్దరూ మళ్లీ ఒక టాక్ షోలో కనిపించారు. అయితే బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం ఇదే తొలిసారి.