లండన్: కోపా అమెరికా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా యూరోపియన్ చాంపియన్స్ ఇటలీపై అర్జెంటీనా చరిత్రాత్మక విజయం సాధించింది. లండన్‌లోని వెంబ్లి స్టేడియంలో జరిగిన ఫైనలిసిమాలో ఇటలీపై అర్జెంటీనా 3-0తో గెలుపొందింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ కప్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మెస్సీ తోడుగా, లౌటారో మార్టినెజ్, ఏంజెల్ డి మారియా చేసిన స్ట్రైక్‌లతో గోల్స్ దక్కాయి. దీంతో అర్జెంటీనా మొదటి అర్ధభాగంలో రెండు గోల్స్‌తో ఇటలీపై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పాలో డైబాలా అర్జెంటీనాకు రెండో అర్ధభాగంలో గోల్ కొట్టడంతో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. ఇకపోతే పారిస్ సెయింట్-జర్మన్ టోర్నీలో నిరాశపరిచిన తర్వాత మెస్సీ మళ్లి తన అత్యున్నత ప్రదర్శన పుంజుకున్నాడు. ఫైనలిస్సిమాలో వేగంగా బంతిని తన కంట్రోల్లోకి తెచ్చుకుని గోల్స్ వచ్చేలా చేశాడు. మ్యాచ్ ముగింపు విజిల్ తర్వాత మెస్సీ గాల్లోకి ఎగిరి విజయోత్సవాన్ని జరుపుకున్నాడు.
మ్యాచ్ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ”ఈరోజు ఇటలీ లాంటి గొప్ప జట్టు మీద గెలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నాడు. ఉంటుందని మాకు తెలుసు. ఇక 28ఏళ్ల నిరీక్షణ తర్వాత 2021లో కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా గెలుచుకున్న సంగతి తెలిసిందే. తద్వారా అర్జెంటీనా ఈ ఏడాది ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. యూరోపియన్ కప్ విజేత ఇటలీని ఓడించడం ద్వారా.. రానున్న వరల్డ్ కప్ కోసం తాము ప్రధాన పోటీదారులుగా ఉంటామనే సంకేతాలను అర్జెంటీనా ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..