Monday, November 18, 2024

Argentina: తుఫాన్ గాలికి.. మెట్ల‌ను ఢీకొట్టిన‌ విమానం..

అర్జెంటీనాలో తీవ్రమైన తుఫాన్ కారణంగా 16 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ తుఫాన్ మొదటి సారిగా డిసెంబర్ 16న బ్యూనస్ ఎయిర్స్‌కు దక్షిణంగా 570 కిలో మీటర్ల (355 మైళ్ళు) దూరంలో ఉన్న ఓడరేవు నగరం బహియా బ్లాంకాలో ల్యాండ్‌ ఫాల్ చేసింది. దీంతో భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అర్జెంటీనాలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ గాలుల బారి నుంచి విమానాలు సైతం తప్పించుకోలేకపోతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న ఓ విమానం బలమైన గాలులు వీయడంతో 90డిగ్రీల మలుపు తిరిగి అక్కడ నిలబడి ఉన్న మెట్లను ఢీకొట్టింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. విమానం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని జార్జ్ న్యూబెరీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగి ఉంది. అయితే, బలమైన గాలులు రావడంతో సిబ్బంది విమానాలను ఎయిర్ పోర్టులో నిలిపి ఉంచారు. కానీ ఒక్కసారిగా భారీ ఎత్తున గాలులు రావడంతో ఆ విమానాన్ని రక్షించుకోలేకపోయారు. గాలి తీవ్రత పెరగడంతో విమానం కూడా విమానాశ్రయంలో 90 డిగ్రీలు మలుపు తిరిగింది. ఈ సమయంలో విమానానికి మెట్లు కూడా ఉన్నాయి. విమానం ఢీకొనడంతో మెట్లు కింద పడిపోవడంతో విమానం వెనకాల భాగం కొద్దీగా దెబ్బతింది. అయితే, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement