Wednesday, November 20, 2024

నీ వెనుక ఆర్మూర్ ఉంది…తిడుతున్నాడా ? సపోర్ట్ చేస్తున్నాడా ?

తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ఆలోచన కూడా లేదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఉన్నందున పసుపు బోర్డు ఏర్పాటు చేయలేమని.. తెరాస ఎంపీ సురేష్రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు పసుపు బోర్డు తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ రాసి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ధర్మపురి అరవింద్ పై ఒత్తిడి తెస్తున్నారు టిఆర్ఎస్ నేతలు. తాజాగా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఆర్మూరు రైతులు మీ రాజీనామా కోసం వేచి చూస్తున్నారని…పసుపు బోర్డు ఏర్పాటు అయ్యే వరకు మీతోపాటు ఉద్యమ బాటలో నడుస్తారని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాటితో పాటు గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్ రాసిన బాండ్ పేపర్ ని కూడా షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement