Friday, November 22, 2024

ఆదిపినిశెట్టి దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్నారా..

హీరో హీరోయిన్ ఆదిపినిశెట్టి..నిక్కీగ‌ల్రానిలు ఈ ఏడాది వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు.మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వీరిద్దరి వివాహం జరిగింది. త్వరలో ఆది పినిశెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ మీడియాలో నిక్కీ గల్రాని గర్భవతి అంటూ ప్రచారం జరుగుతోంది.

నిక్కీ గల్రాని. ఆది పినిశెట్టి త్వరలో తల్లి తండ్రులు కాబోతున్నారట. అయితే ఈ న్యూస్ ని ఆది పినిశెట్టి ఇంకా అఫీషియల్ గా ఖరారు చేయలేదు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని బ్యూటిఫుల్ కపుల్ గా అభిమానులు ఆకట్టుకుంటున్నారు. ఆది పినిశెట్టి చివరగా ‘ది వారియర్’ చిత్రంలో విలన్ గా నటించాడు. గతంలో ఆది.. సరైనోడు, అజ్ఞాత వాసి చిత్రాల్లో విలన్ రోల్స్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆది పినిశెట్టి రాణిస్తున్నాడు. సీనియర్ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడే ఆది పినిశెట్టి. ఇమేజ్ చక్రంలో ఇరుక్కుపోకుండా బలమైన పాత్రలకు ప్రాధ్యానత ఇస్తూ విలక్షణ నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement