పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భాగంగా నేడు జరిగిన ఆర్చరీ క్వార్టర్-ఫైనల్‌లో భారత పురుషుల జట్టు ఓటమిపాలైంది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారర పురుషుల జట్టు టర్కీ చేతిలో 6-2 తేడాతో ఓడిపోయింది. మొత్తం నాలుగు సెట్లు ఆడిన భారత జట్టు మూడో సెట్లో గెలిచింది. దీంతో రెండు పాయింట్లు సాధించింది.
మరోవైపు ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన టర్కీ… వరుసగా రెండు సెట్లు గెలిచి మూడో సెట్ ను కోల్పోయింది. ఆ తరువాత మళ్లీ పుంజుకున్న టర్కీ నాలుగో సెట్‌ను గెలుచుకుంది. దీంతో టర్కీ మూడు సెట్లలో విజయం సాధించి 6 పాయింట్లతో భారత్‌ను ఓడించింది. అయితే సెమీఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిన టర్కీ.. రజత పతకం కోసం చైనాతో తలపడి రజతం సాధించింది.
ఇక అంకితా భకత్, భజన్ కౌర్, దీపికా కుమారిలతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 6-0తో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. కాగా, రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమయ్యే వ్యక్తిగత రౌండ్లలో మొత్తం ఆరుగురు భారత ఆర్చర్లు పోటీపడనున్నారు. ఇక శుక్రవారం జరిగే మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అంకిత భకత్, ధీరజ్ బొమ్మదేవర పాల్గొంటారు.