Friday, November 22, 2024

ఐపీఓకు ఆర్కియన్‌ కెమికల్స్‌.. సెబీకి పత్రాల అందజేత

ఐపీఓల సందడి ప్రారంభం అవుతున్నది. రసాయనాల ఉత్పత్తి సంస్థ అయిన ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓగా వచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు (సోమవారం) సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.2,200 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. రూ.1000 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 1.9 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉంటాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను గతంలో జారీ చేసిన నాన్‌ కన్బర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) రీడెవ్షున్‌కు వినియోగించేందుకు కంపెనీ నిర్ణయించింది.

దీంతో తమపై కొంత వరకు రుణ భారం తగ్గుతుందని వివరించింది. డెట్‌ టు ఈక్విటీ రేషియో మెరుగుపడి కంపెనీ పనితీరు మరింత బాగుంటుందని ఆశిస్తున్నది. కంపెనీ కార్యకలాపాల ద్వారా సమకూరే ఆదాయం 2019-2021 మధ్య ఏటా 9.42 శాతం వృద్ధి రేటు చొప్పున రూ.565.5 కోట్ల నుంచి రూ.740.76 కోట్లకు పెరిగింది.

గుజరాత్‌లో ప్లాంట్లు..

ఆర్కియన్‌ కెమికల్‌ ఇండస్ట్రీస్‌ అనేది.. బ్రొమైన్‌, ఇండస్ట్రియల్‌ సాల్ట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వంటి రసాయనాలను విక్రయిస్తుంటుంది. రాన్‌ ఆఫ్‌ కచ్‌లో బ్రైన్‌ రిజర్వులు, గుజరాత్‌లోని హజిపూర్‌లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఫార్మా, అగ్రో కెమికల్స్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌, ప్లేమ్‌ రిటార్డెంట్‌, అడిటీవ్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఎనర్జీ స్టోరేజీ వంటి విభాగాల్లో బ్రొమైన్‌ను వినియోగిస్తున్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జేఎం ఫైనాన్షియల్‌లు ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement