అర్సెలర్ మిట్టల్ కు చెందిన ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్‌ను భారీగా విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని 9 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు విస్తరించనున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఆదిత్యా మిట్టల్ తెలిపారు. ఇందుకోసం 60 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్లాంట్ వద్ద ఆయన శుక్రవారం నాడు భూమి పూజ నిర్వహించారు. స్టీల్ తయారీ టెక్నాలజీని ఉపయోగిస్తామని, ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్లాంట్‌కు 24 గంటలు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు వీలుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మాతృసంస్థ ఆర్సెలర్ కంపెకనీకి ఆదిత్య మిట్టల్ సీఈఓగా ఉన్నారు. ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్‌లో ఆయనకు 60 శాతం వాటా ఉంది. 2019లో అర్సెలర్ కంపెనీ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ సంయుక్తంగా యస్సార్ స్టీల్ లిమిటెడ్‌ను కొనుగోలు చేశాయి. అనంతరం కంపెనీ పేరును అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టిల్(ఏఎంఎన్ఎస్)గా మార్చారు. గుజరాత్‌లోని హజారియాలో ఈ ప్లాం ట్ ఉంది. ప్లాంట్ విస్తరణకు పర్యావరణ అనువతులు వచ్చాయని ఏఎంఎన్ఎస్ అక్టోబర్ 6న ప్రకటించింది.