పెద్దకొత్తపల్లి, (ప్రభన్యూస్) : రైతులు పండించిన ధాన్యంను ఆర పెట్టుకోవడానికి కల్లాలు లేకపోవడంతో పెద్దకొత్తపల్లి దేవల్ తిరుమలాపూర్ మొదలుకొని వనపర్తి రోడ్డు పొడవునా రైతులు పండించిన వరి ధాన్యం రోడ్డు పొడవునా ఆరబోశారు. తేమశాతం 14 వచ్చేవరకు ఆరబెట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి రైతులు శ్రమిస్తున్నారు. దీంతో వనపర్తి నుండి పెద్దకొత్తపల్లి వరకు రోడ్డు పొడవునా వాహనాల సంఖ్య వీటితో పాటు మండల పరిధిలోని వెన్నచర్ల గ్రామ శివారులో కొనసాగుతున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ నెంబర్ 5.2స్టేజీ పంప్ హౌస్ పనుల వద్దకి అతి భారీ వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. కంటిరెప్ప పాటు- మిస్ అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రైతులు పంట పొలాల్లో కల్లాలు నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మండలానికి 240 మంజూరు చేయగా వాటికి పూర్తి స్థాయిలో రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 21 మంది రైతులు ప్రభుత్వం మంజూరు చేసిన కల్లాలను వినియోగించుకున్నారు. అదే విధంగా దేవ తిరుమలాపూర్ గ్రామంలో 9 మంది రైతులకి మంజూరు కాగా నలుగురు రైతులు మాత్రమే పూర్తి చేసుకున్నారు. మిగతా ఐదు మంది రైతులు వినియోగించుకోలేక పోయారు.
రైతులు పంట పొలాల వద్ద కల్లాలకు స్థలాలు లేకుండా ఉన్న మొత్తం భూమిని వ్యవసాయం చేయడంతో రైతులు పండించిన ధాన్యాన్ని ఆర పెట్టు-కునేందుకు స్థలం లేకపోవడంతో ధాన్యాన్ని ఆరబెట్టడానికి రోడ్డు పైకి రావడం జరుగుతుంది. రోడ్డు పొడవునా వరి ధాన్యం పోసి వాటికి రాళ్లు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైతు కల్లాల సైట్‌ను కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టంను అనుసంధానం చేసుకోవడంతో సైట్ కనిపించడం లేద ంటూ పలువురు వాపోతున్నారు. రైతుల కోసం 80 వేల నిధులతో 75 స్క్వేర్ మీటర్ల కల్లం ఒకటి, అదేవిధంగా 70 వేల నిధులతో 60 స్క్వేర్ మీటర్ల కల్లం ఒకటి వీటితో పాటు- 65 వేల రూపాయల నిధులతో 50స్క్వేర్ మీటర్ల కళ్ళం ఒకటి చొప్పున రైతు 10శాతం అమౌంటు కలుపుకొని కల్లాలను నిర్మించుకోవాలి. మంజూరు చేసిన కల్లాలు ఉపాధి హామీ పథకం సైటులో కనబడకుండా పోవడంతో దీంతో రైతులు లబోదిబోమంటు-న్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైతు కల్లాలను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు ఆంజనేయులు, చిన్నయ్య, నిరంజన్, విజ్ఞయ్య, శ్రీనివాసులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..