Friday, November 22, 2024

ఆరాంఘర్​ కొత్త ఫ్లై ఓవర్​ త్వరగా పూర్తి చేయాలి: సోమేశ్‌కుమార్‌

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పుర్ ఫ్లైఓవర్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యానికన్నా ముందే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. రూ. 69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవుగల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మార్చ్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.

ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తులలో మరికొన్ని ఆస్తుల సేకరించాల్సి ఉన్నందున నిర్మాణం పనులకు అంతరాయం కలుగుతోందని ఇంజనీర్లు వివరించారు. ఫ్లైఓవర్ మౌలిక డిజైనింగ్ కు అంతరాయం కాకుండా కొన్ని ఆస్తుల సేకరణ చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ఆరాంఘర్- జూపార్క్ ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఏవిధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విధ్యుత్ పంపిణి సంస్థ, అర్బన్ బయోడైవర్సిటీ, జలమండలి తదితర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement