ఖమ్మం,(ప్రభ న్యూస్) ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏసిపి విజయబాబు ను గురువారం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ వాహనాన్ని తన కుమారుడు చేత డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి ఢీకొట్టిన ఘటనలో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం.
దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కావడంతో ఆయన పై ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.