ప్రబన్యూస్: అప్‌డేట్ చేయబడిన ఏప్రిలియా ఎస్‌ఆర్ 160 మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. పూణెలో దీని ఎక్స్‌షోరూం ధర రూ.1,17,494గా నిర్ణయించింది. పాత మోడల్ కంటే అప్‌డెటెడ్ మోడల్ ధర రూ.10,533 అధికం. అదేవిధంగా ఏప్రిలియా ఎస్‌ఆర్ 125 మోడల్‌ను కూడా మార్కెట్‌కు పరిచయం చేసింది. పుణలో దీని ఎక్స్‌షోరూం ధర రూ.1,07,595గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఉన్న పియాజియో షోరూంలలో.. ఆసక్తిగల వారు ఎస్‌ఆర్ 160 మోడల్‌ను ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లి రూ.5000 చెల్లించి బుకింగ్ సదుపాయాన్ని పొందొచ్చు. కొత్త ఎస్‌ఆర్ 160 మోడల్.. వైట్, బ్లూ, గ్రే, రెండ్, మ్యాట్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఏప్రిలియా 160 మోడల్.. ముందు భాగం సరికొత్తగా డిజైన్ చేశారు. అందమైన హెడ్ ల్యాప్‌ను ఏర్పాటు చేశారు. పాత మోడల్‌లో హాలోజెన్ యూనిట్ ఉండేది. దీని స్థానంలో ఎల్‌ఈడీ హెడ్ లైట్‌ను అమర్చారు. ఇది వాహనం ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. వాహన ప్రియుల అభిరుచికి అనుగుణంగా ఏప్రిలియా ఎస్‌ఆర్ 160 మోడల్‌ను తీర్చిదిద్దినట్టు పియాజియో ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డియోగో గ్రాఫీ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో దీన్ని తయారు చేసినట్టు వివరించారు. సరికొత్త ఎస్‌ఆర్ 160 మోడల్ మార్కెట్‌లో దూసుకుపోతుందని పియాజియో ఇండియా టూ వీలర్ బిజినెస్ హెడ్ సుధాన్షు అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily