ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. రవితేజ “రావణాసుర” , కిరణ్ అబ్బవరం “మీటర్”, సంమంత “శాకుంతలం”, సాయి ధరమ్ తేజ్ “విరూపాక్ష”, అఖిల్ “ఏజెంట్” వంటి సినిమాలు ఈ నెలలో భారీ అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే.. గత నెల (మార్చి) 30న రిలీజ్ అయిన నాని “దసరా” ఏప్రిల్ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇక, ఈ నెలలో రవితేజ, కిరణ్ అబ్బవరం.. రావణాసుర, మీటర్ ఈ రెండూ ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కాగా, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రవితేజ “రావణాసురష కి మెదటి రోజే బాక్సీఫీస్ వద్ద తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఆ తర్వాత కూడా కలెక్షన్స్ లో ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన “మీటర్ష సినిమా అతి తక్కువ రేటిగ్స్ తో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో ప్లాప్ గా నిలిచింది.
సమంతా ఫీమేయిల్ లీడ్ లో.. దిల్ రాజు భారీ వ్యయంతో తెరకెక్కించిన పౌరాణిక నాటకం “శాకుంతలంష . ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. ఈ సినిమా ఏకంగా పాన్-ఇండియన్ లెవల్ లో ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు దాదాపు 20 కోట్ల నష్టాన్ని చవిచూశారు.
ఇక మూడవ వారంలో “విరూపాక్షష రిలీజ్ అయింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించింన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి రోజు నెమ్మదిగా ప్రారంభమైనా.. రెండవ రోజు నుంచి మంచి టాక్ సోంతం చేసుకుని.. ఇప్పటికీ థియేటర్లలో ఆకట్టుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ లో, ఈ చిత్రం $1.5 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్.
ఈ నెల ఏప్రిల్ చివరి వారంలో “ఏజెంట్” రూపంలో మరో పెద్ద ప్టాప్ ఎదురైంది ఇండస్ట్రీకి. ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్షన్లు రాబట్టలేక ఇబ్బంది పడుతోంది ఈ సినిమా. దీంతో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన ‘ఏజెంట్’ మరో పెద్ద డిజాస్టర్ గానే నిలిచింది.
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే ఇందులో “రుద్రుడు”, “విడుదల 1” , “పొన్నియన్ సెల్వన్ 2” సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో రాఘవ లారెన్స్ “రుద్రుడు” ఫ్లాప్ అవ్వగా, మిగిలిన రెండు సినిమాలు పాజిటివ్ రివ్యూలను అందుకున్నాయి.