Tuesday, December 24, 2024

TG | జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం !

జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన, కమిషనర్ ఇలంబర్తి సమక్షంలో స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ అంచనాలపై స్టాండింగ్ కమిటీ విస్తృతంగా చర్చించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.8,440 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

- Advertisement -

కాగా, రెవెన్యూ రాబ‌డులు రూ.4,445 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.4 వేల కోట్లుగా అంచనా వేశారు. రూ.445 కోట్ల రెవెన్యూ మిగులు చూపారు. హెచ్-సీటీ కింద రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు గ్రాంట్ రూపంలో కేటాయించినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. 2024-25లో రెవెన్యూ రాబడులను రూ.5,398 కోట్ల నుంచి రూ.4,052 కోట్లకు సవరించినట్లు తెలిపారు.

ఆమోదించిన బడ్జెట్‌లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.687 కోట్లు, వీధి దీపాలకు రూ.186 కోట్లు, భూసేకరణకు రూ.283 కోట్లు, ఎస్‌ఎన్‌డీపీ కింద రూ. 408 కోట్లు, హెచ్‌సిటీకి రూ.1,600 కోట్లు, గ్రీన్ బడ్జెట్‌కు రూ.344 కోట్లు కేటాయించినట్లు మేయర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement