హైదరాబాద్, ఆంధ్రప్రభ: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని రకాల పోస్టులను నాలుగు కేటగిరీలుగా విభజించి భర్తీ చేయనున్నారు. కేటగిరి -1లో ప్రత్యేక వైద్య నిపుణులుగా… అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లను చేర్చారు. కేటగిరి 2లో ఎంబీబీఎస్ వైద్యుల హెడ్ కింద సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, ట్యూటర్స్‌ను పేర్కొన్నారు. కేటగిరి 3లో స్టాఫ్ నర్సులను, కేటగిరి-4లో ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ ఉద్యో గాలను చేర్చారు. నియామకాల భర్తీలో ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటీజీ ఇవ్వనున్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్‌కు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్లలో ఈ వెయిటేజీ వర్తించనుంది. అర్భన్ లో పనిచేసిన సిబ్బందికి 6 నెలలకు 2 పాయింట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బందికి ఆరు నెలలకు 2.5పాయింట్లు ఇవ్వనున్నారు. మొత్తంగా కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి నియామకాల్లో గరిష్టంగా 20 మార్కుల చొప్పున వెయిటేజీ లభించనుంది.
అయితే టీఎస్‌పీఎస్సీ, మెడికల్ బోర్డు ద్వారా జరిగే రిక్రూట్ మెంట్లకే ఈ వెయిటేజీ వర్తించనుంది. ఏ పోస్టులకు అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నాడో… అదే కేడర్‌లో అంతకు ముందు ఆయన పనిచేసి ఉండాలి. ప్రభుత్వ కేటగిరి-1లో 80శాతంమార్కులను రాతపరీక్ష ద్వారా నిర్ణయించనున్నారు. కేట గిరి 3, 4లోని నియామకాల భర్తీలో 80శాతం మార్కులను రాతపరీక్ష ద్వారా, 20 శాతం వెయిటేజీని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వనున్నారు. స్పెష లిస్టు వైద్యులకు పోస్టు గ్రాడ్యుయేట్/పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధా రంగా గరిష్టంగా 80 పాయింట్లు, మార్కులు ఇవ్వని విశ్వ విద్యా లయాల్లో చది విన అభ్యర్థులకు గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో నియమించిన వైద్యులను సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూ టీ మెడికల్ ఆఫీసర్‌గా విభజించారు. వీరికి ఎంబీబీఎస్ మార్కుల శాతం ఆధా రంగా గరిష్టంగా 80 పాయింట్లు ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.