ప్రస్తుతం నడుస్తున్న షిర్డీసాయి సంస్థాన్ ట్రస్ట్ (పాలకమండలి) నియమాకం చెల్లదంటూ.. ట్రస్టీని ముంబైలోని ఔరంగాబాద్ హైకోర్టు రద్దు చేస్తున్నట్లు మంగళవారం తీర్పు వెలువరించింది. మహాఅగాడి ప్రభుత్వ హయాంలో 16మంది సభ్యులతో నియమించబడిన పాలకమండలి సభ్యుల ఎంపిక న్యాయపరంగా నియామకం జరగలేదని సామాజిక కార్యకర్త ఉత్తమ్ షెల్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ వాదనను విచారించిన హైకోర్టు బెంచ్ 16మంది సభ్యుల ట్రస్ట్ నియామకాన్ని రద్దు చేసింది. తిరిగి 8 వారాల్లోగా నూతన ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అప్పటివరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి.. సంస్థాన్ వ్యవహారాలు అమలు చేసేలా తీర్పును వెలువరించింది. గతంలో ఉద్దవ్ థాక్రే హాయాంలోని సంకీర్ణ ప్రభుత్వం 16 మంది సభ్యులతో ఆలయ ధర్మకర్తల మండలిలో జయంత్ యాదవ్, మహేంద్ర షెల్క్, సురేష్ వాబుల్, అనురాధ అధిక్, డా||సాయిబాబ ట్రస్టీలుగా .. ఏక్నాథ్ గోండ్కర్, సచిన్ గుజర్, రాహుల్ కనల్, సుహాస్ అహేర్, అవినాష్ దండేవాటేలను నియమించిన అగాఢి ప్రభుత్వం .. రాజకీయంగా.. న్యాయపరంగా నియమించకపోవడం, అలాగే చట్టపరంగా నియమాకం జరుగలేదని పిటిషనర్ పేర్కొన్నాడు. వీటిపై విచారణ స్వీకరించిన హైకోర్టు బెంచ్ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తుదితీర్పును మంగళవారం వెలువరించింది.