Monday, November 18, 2024

RRR డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందన

రీజనల్ రింగు రోడ్డు ప్రాజెక్టు విషయంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మ‌రోవైపు ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో.. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ విషయంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కసర్తతు చోస్తోంది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి సర్కార్ అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement