Tuesday, October 29, 2024

TG | 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోల నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జిల్లా వైద్యాధికారుల పోస్టుల ఖాళీగా ఉన్న చోట్ల ఆ బాధ్యతలను సీనియర్‌ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పింది. ఈ మేరకు 13 జిల్లాలకు ఇన్చార్జి జిల్లా వైద్యాధికారులను నియమిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్డూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • ఆదిలాబాద్‌ జిల్లా వైద్యాధికారి బాధ్యతలను డీఎసీఎస్‌ డాక్టర్‌ నరేందర్‌కు,
  • జనగామకు ఏడీపీహెచ్‌వో డా.మల్లికార్జున్‌ కు,
  • జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి బాధ్యతలను డీఎస్‌ డాక్టర్‌ ఎస్‌కే. సిద్దప్పకు,
  • ఖమ్మం బాధ్యతలను డా. కళావతి బాయిని,
  • ఆసీఫాబాద్‌ జిల్లా బాధ్యతలను డీసీఎస్‌ కే. సీతారాంకు,
  • మహబూబాబాద్‌ బాధ్యతలను డీసీఎస్‌ డాక్టర్ జీ.మురళీధర్‌కు,
  • మహబూబ్‌నగర్‌కు డా. కే. కృష్ణకు,
  • ములుగుకు డీసీఎస్‌ డాక్టర్‌ గోపాల్‌రావు ను,
  • పెద్దపల్లికి ఏడీపీహెచ్‌వో డా. అన్నప్రసన్నకుమారిని ,
  • సిద్ధిపేటకు మెదక్‌ అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ బీ. పల్వన్‌ కుమార్‌ను,
  • వికారాబాద్‌ డాక్టర్‌. వై. వెంకటరావణ,
  • వనపర్తికి డీఎసీఎస్‌ డా. ఏ. శ్రీనివాసులును,
  • యాదాద్రి భువనగిరికి ఏడీపీహెచ్‌వోల డా. ఎం. మనోహర్‌కు డీఎంహెచ్‌వో బాధ్యతలను అప్పగించారు.

ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌కు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement