తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాల అర్హత కోసం నిర్వహించే రాష్ట్ర స్థాయి పరీక్ష “సెట్ష. కాగా, ఈ సెట్ పరీక్షల కోసం ఉన్నత విద్యా మండలి కన్వీనర్‌లను నియమించింది.
ఈ మేరకు ఏడు సెట్లకు సంబంధించి కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఏ యూనివర్సిటీ ఏ సెట్ నిర్వహిస్తుందో కూడా ప్రకటించింది. సెట్స్ నిర్వహణ తేదీలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.
టీజీ ఐసెట్ – ప్రొఫెసర్ అలువాల రవి (మహాత్మా గాంధీ యూనివర్సిటీ)
టీజీ ఎప్‌సెట్ – ప్రొఫెసర్ బీ డీన్ కుమార్ (జేఎన్‌టీయూ హెచ్)
టీజీ పీజీసెట్ – ప్రొఫెసర్ అరుణ కుమారి (జేఎన్‌టీయూహెచ్)
టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్ – ప్రొఫెసర్ బీ విజయలక్ష్మీ (ఉస్మానియా యూనివర్సిటీ)
టీజీ ఈసెట్ – ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ (ఉస్మానియా యూనివర్సిటీ)
టీజీ ఎడ్‌సెట్ – ప్రొఫెసర్ బీ వెంకట్రామ్ రెడ్డి (కాకతీయ యూనివర్సిటీ)
టీజీ పీఈసెట్ – ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ (పాలమూరు యూనివర్సిటీ)