Friday, November 22, 2024

రెండేళ్లలో 25 మంది న్యాయమూర్తుల నియామకం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిల నియామకంపై కేంద్రం బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 2020 నుంచి 2023 వరకు 25 మంది న్యాయమూర్తుల నియామకం జరిగిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 అని, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

హైకోర్టులో ప్రస్తుతం 32 మంది పని చేస్తున్నారని, మరో 5 ఖాళీలున్నాయని తెలిపారు. ఖాళీ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఒక న్యాయమూర్తి నియామకం సుప్రీంకోర్టు కొలీజియం వద్ద పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. మిగతా 4 ఖాళీలను భర్తీ చేయడానికి హైకోర్టు సిఫారసు చేయాల్సి ఉందని కేంద్రమంత్రి చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement