Saturday, November 23, 2024

హైకోర్టులో 65 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో హైకోర్టులో జడ్జిలు, రిజిస్ట్రార్ల పర్సనల్‌ సెక్రటరీలు, కోర్టు మాస్టర్ల 65 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీ చేయనున్నారు. ఈమేరకు 65 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేర్కొన్నారు. భారత దేశంలోని యూనివర్సిటీ లేదా యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుంచైనా డిగ్రీ లేదా లా విద్యను అభ్యసించిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించారు. దరఖాస్తులను ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలంగాణ హైకోర్టుకు పంపాలని వెల్లడించారు.

దరఖాస్తు దారులకు జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 34 ఏళ్లు మించరాదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరికి చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునిచ్చారు. ఓసీ, బీసీ కేటగిరీల వారికి ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎఓస్‌ కేటగిరి అభ్యర్థులు రూ.400 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు డీడీలను ది రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), తెలంగాణ హైకోర్టు పేరిట తీయాలి. దరఖాస్తులను స్పీడ్‌ పోస్టు లేదా కొరియర్‌ ద్వారా ఈనెల 22 సాయంత్రం 5 గంటల్లోపు హైకోర్టుకు పంపాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement