హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యుఎస్) కల్పించే 10 శాతం రిజర్వేషన్‌ను పారామెడికల్ కోర్సులకు వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీపీటీ, ఎంపీటీ, పీబీబీఎస్సీ, ఎంఎస్సీ-నర్సింగ్, కోర్సుల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాళోజీ హెల్త్ వర్సిటీకి ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో బీపీటీ 69 సీట్లు, ఎంపిటి 6 సీట్లు, ఎంఎస్సీ నర్సింగ్ 25 సీట్లు, పీబీబీఎస్సీలో 23 సీట్లు రిజర్వ్ కానున్నాయి.
ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, అనుబంధ హెల్త్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్ సీట్లలో 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తున్నది. అలాగే, ఎంబీబీఎస్‌లో 203 సీట్లు, ఇతర పారామెడికల్ కోర్సుల్లోని కాంపిటెంట్ కోటాలో 648 సీట్లు, రిజర్వ్ అవుతాయి. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.