దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ అమెరికా కాలిఫోర్నియా వేదికగా ‘ఆపిల్ స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ తో మార్కెట్ లోకి పలు కొత్త మోడల్స్ ని లాంచ్ చేసింది. సరికొత్త ఐమ్యాక్‌తో పాటు ల్యాప్‌టాప్‌నిసైతం ఆవిష్కరించింది. ఇక ఈ ఈవెంట్ లో కంపెనీ లాంచ్ చేసిన గాడ్జెట్‌లు, వాటి ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..
సరికొత్త మ్యాక్ బుక్ ప్రో- ధర ఎంతంటే..?
ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్లో.. 14 ఇంచ్, 16 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో మోడల్స్ ని ఆవిష్కరించింది. వీటిల్లో ఎం3 ప్రో, ఎం3 మ్యాక్స్ చిప్సెట్స్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్స్ లో మినీ ఎల్ఈడీ డిస్ప్లే, 1080పీ కెమెరా, 6 స్పీకర్ ఆడియో, 22 గంటల బ్యాటరీ లైఫ్, 128జీబీ ర్యామ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇక, ఈ Apple New MacBook pro price విషయానికొస్తే.. 14 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో ధర 1,999 డాలర్లు. 16 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో ధర 2,499 డాలర్లు గా ఉంది. అయితే.. బేస్ ఎం3 చిప్సెట్తో కూడా 14 ఇంచ్ మ్యాక్బుక్ ప్రో మోడల్ను కూడా లాంచ్ చేసింది ఆపిల్ సంస్థ. దీని ధర 1,599 డాలర్లు గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్ ఉంటుంది.
New iMac -కొత్త ఐమ్యాక్ లాంచ్ :
ఈ ఆపిల్ స్కేరీ ఈవెంట్‌లో 24 ఇంచ్ ఐమ్యాక్ ని కూడా లాంచ్ చేసింది కంపెనీ. ఇందులో ఎం3 చిప్సెట్ ఉంటుంది. ఫలితంగా ప్రదర్శన రెట్టింపు అవుతుంది. ఈ అప్డేటెడ్ ఐమ్యాక్ లో.. 4.5కే రెటీనా డిస్ప్లే ఉంటుంది. వైఫై 6ఈ, 1080పీ వెబ్ క్యామ్ వంటివి ఉంటాయి. 24జీబీ మెమోరీ లభిస్తోంది. 7 కలర్స్లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఐమ్యాక్ 8 కోర్ సీపీయూ ధర 1,299 డాలర్లు. 10- కోర్ సీపీయూ ఐమ్యాక్ ధర 1499 డాలర్లు గా ఉంది.
ఆపిల్ ఎం3 చిప్.. ఫీచర్లివే..
ఈ ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్‌లో లాంచ్ అయిన M3 చిప్‌సెట్, కంపెనీ ఇంటర్నల్ మ్యాక్ ప్రాసెసర్ లైనప్‌లో తర్డ్ జెనరేషన్ ప్రాసెసర్. ఈ అడ్వాన్స్‌డ్ చిప్‌సెట్.. డివైజ్‌ల మొత్తం పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. గ్రాఫిక్స్ హార్స్‌పవర్‌కు అప్‌గ్రేడ్స్‌తో M3 చిప్‌ను యాపిల్ విడుదల చేసింది. ఈ కొత్త చిప్ లైనప్, అడ్వాన్స్‌డ్ 3-నానోమీటర్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది.
ఇది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ను మరింత సమర్థవంతంగా మేనేజ్ చేస్తుందని యాపిల్ తెలిపింది. బేస్ మోడల్ ఎనిమిది మెయిర్ కోర్స్‌తో వస్తుంది. గ్రాఫిక్స్ కోసం 10 కోర్స్ అదనంగా ఉంటాయి. ఇవన్నీ డివైజ్ పర్ఫార్మెన్స్‌ను మరింత ఇంప్రూవ్ చేస్తాయి. 3-నానోమీటర్ టెక్నాలజీతో వచ్చిన ఇటువంటి చిప్స్, బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేస్తూనే పనితీరును పెంచుతాయి.
ఈ సిరీస్‌లో మరో రెండు చిప్స్
ఆపిల్ M3 సిరీస్‌లో ప్రో, మాక్స్ వెర్షన్లను కూడా పరిచయం చేసింది. కంపెనీ హై పర్ఫార్మెన్స్ డివైజ్‌లలో వీటిని వినియోగించింది. M3 ప్రో చిప్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌లో 12 కోర్స్‌తో పాటు గ్రాఫిక్స్ కోసం 18 కోర్స్ ఉంటాయి. M3 మ్యాక్స్ ప్రాసెసర్‌లో 16 మెయిన్ కోర్స్, 40 గ్రాఫిక్స్ కోర్స్ ఉంటాయి. 2021 నుంచి ఉన్న M1 చిప్ కంటే ఇది 80% ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.