Sunday, November 3, 2024

ఇండియాలో యాపిల్‌ రిటైల్‌ స్టోర్లు.. ఉద్యోగ నియామకాలు ప్రారంభం

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెకనీ యాపిల్‌ మన దేశంలో త్వరలో రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనుంది. దేశ రాజధాని ఢిల్లి, ఆర్ధిక రాజధాని ముంబైలో ఈ స్టోర్లను ఏర్పాఉట చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందు కోసం అవసమైన ఉద్యోగులను నియామక ప్రక్రియను ప్రారంభించింది. యాపిల్‌ చాలా కాలం నుంచి మన దేశంలో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కొన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో నేరుగా ఉత్పత్తులను విక్రయిస్తున్నప్పటికీ, ఆఫ్‌లైన్‌లో మాత్రం థర్డ్‌ పార్టీ స్టోర్ల ద్వారా ఉత్పత్తులను విక్రయిస్తోంది. సొంతంగానే రిటైల్‌ స్టోర్లు ప్రారంభించాలని యాపిల్‌ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. కొవిడ్‌ మూలంగా ఈ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.

అమెరికా, చైనాలో రిటైల్‌ స్టోర్లను యాపిల్‌ నిర్వహిస్తోంది. భారత్‌లో ప్రారంభించనున్న రిటైల్‌ స్టోర్స్‌లో ఉద్యోగులు కావాలని యాపిల్‌ ప్రకటన ఇచ్చింది. టెక్నికల్‌ స్పెషలిస్టు, స్టోర్‌ లీడర్‌, స్పెషలిస్ట్‌ సీనియర్‌ మేనేజర్‌, ఆపరేటింగ్‌ ఎక్స్‌ఫర్ట్‌, మార్కెటింగ్‌ లీడర్‌, మేనేజర్‌ వంటి వివిధ హోదాలకు సంబంధించి మొత్తం వంద మంది ఉద్యోగులను యాపిల్‌ కంపెనీ తన కెరీర్స్‌ పేజీలో ప్రకటన జారీ చేసింది. తొలుత న్యూఢిల్లి, ముంబై నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తారు. తరువాత కాలంలో పుణే, బెంగళూర్‌ వంటి నగరాలకు విస్తరించాలని యాపిల్‌ నిర్ణయించింది. యాపిల్‌ ఐఫోన్ల తయారీని ఇండియాలో పెంచేందుకు కూడా ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement