ఆపిల్ ఫోన్ అంటే చాలామంది క్రేజీగా ఫీలవుతారు. ఐఫోన్ 13 పేరుతో ఈ మధ్య కొత్త ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. ఏటా ఓ కొత్త మోడల్‌ను తీసుకొస్తూ వాటిలో తమదైన ప్రత్యేకతను చాటుతూనే ఉంటుంది. ఫోన్‌కు తగ్గట్టే వాటి రేట్లు కూడా అదిరిపోతాయి. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధరలు చాలా ఎక్కువ. ఆపిల్ సంస్థ తీసుకొచ్చే ప్రతి ప్రొడక్ట్ ధర ఇట్లానే ఉంటుంది. అయితే తాజాగా ఐఫోన్ల స్క్రీన్‌ను తుడిచేందుకు ఓ చిన్న క్లాత్‌ను ఆపిల్ సంస్థ రిలీజ్ చేసింది.
అయితే.. దీని రేట్ చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టడం ఖాయం. ఆపిల్ లోగోతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ క్లాత్ ధర 19 డాలర్లు (రూ.1424). ఇండియాలో దీని రేట్ రూ.1900గా నిర్ణయించింది ఆ సంస్థ. ఐఫోన్ 6 మొదలుకొని ఆ తర్వాత వచ్చిన అన్ని ఫోన్ల స్క్రీన్లను దీంతో శుభ్రం చేసుకోవచ్చని చెప్పింది. ఈ క్లాత్‌కు భారీగానే డిమాండ్ ఉన్నా.. అందుకు తగ్గట్టు సప్లయ్ మాత్రం లేదు. సోమవారం రెండు కొత్త మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్‌ను రిలీజ్ చేస్తూ వాటితోపాటు ఈ క్లాత్‌ను కూడా తీసుకొచ్చింది యాపిల్ సంస్థ.