టెక్ దిగ్గజం ఆపిల్ తన రాబోయే ఐఫోన్ సిరీస్ మోడల్‌లను భారతదేశంలో తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిప్ కంపెనీ ఇప్పటికే పలు ఐఫోన్ మోడళ్లను భారత్‌లో తయారు చేస్తోంది. ఇక రాబోయే 16 ప్రో, 6 ప్రో మాక్స్ ఫోన్‌లు కూడా భారతదేశంలోనే తయారు చేయనుంది.
ఐఫోన్ 16 మోడల్ మొబైల్‌ల డిజైన్‌ను విడుదల చేసిన తర్వాత, భారతదేశంలో తయారీ ప్రారంభమవుతుంది. కాగా, ఆపిల్ కంపెనీ మరో రెండు నెలల్లో ఐఫోన్ 16ని మార్కెట్లోకి తీసుకురానుంది. ఇక ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో రిలీజ్ చేసిన మొదటి రోజునే భారత్‌లోనూ ఐఫోన్ 16 మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఇక యూనియన్ బడ్జెట్ 2024-25 తర్వాత, భారతదేశంలో ఐఫోన్‌ల ధరలు తగ్గాయి. భారత్‌లో పలు మోడల్స్ ఐఫోన్‌ల రేట్లను తగ్గిస్తున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఆపిల్ కంపెనీ ఐఫోన్ 15, ఐఫోన్ 14 లతో పాటు అనేక మోడల్ ఫోన్‌ల ధరలను రూ.6,000 వరకు తగ్గించింది.