Sunday, November 24, 2024

Exclusive | ఆపిల్​ ఐఫోన్​–15 సిరీస్ అప్​డేట్​​.. సెప్టెంబర్​ 13న గ్రాండ్​గా లాంచ్​ ఈవెంట్​!

ఆపిల్​ కంపెనీకి చెందిన ఐఫోన్​ అంటే టెక్​ ప్రియులు ఎంతో ఇంట్రస్ట్ చూపుతారు. ఇక.. ఏటా కొత్త మోడల్స్​ని ఆపిల్​ తీసుకొస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్​ 13న ఐఫోన్​–15 మోడల్​ ఫోన్లను లాంచ్​ చేయనున్నట్టు లీకులు అందుతున్నాయి. దీనిపై ఇప్పటికైతే కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, కొంతమంది టెక్​ ఎక్స్​పర్ట్స్​ మాత్రం కొత్త ఫోన్ల స్పెషిపికేషన్స్, మోడల్స్​ డిటెయిల్స్​ గురించి చర్చిస్తున్నారు..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ​

Apple లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుడ్​ న్యూస్​ రానే వచ్చింది. మరో నెల రోజుల్లో కొత్త మోడల్స్​ లాంచ్​ చేయనున్నట్టు లీకులు వస్తున్నాయి. అందరూ అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న iPhone 15 సిరీస్‌ను సెప్టెంబర్ 13న ప్రారంభించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో ఫోన్లలో మెరుగైన పనితీరు, కొత్త కెమెరా ఫీచర్లు.. మరింత ఆధునిక డిజైన్‌లు ఉంటాయని సమాచారం.

కాలిఫోర్నియా కుపెర్టినోలోని Apple పార్క్ లో జరిగే ఓ స్పెషల్​ ఈవెంట్​ ద్వారా ఏటా కొత్త iPhoneలను ఆవిష్కరిస్తారు.  కాగా, ఓ టెక్​ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆపిల్​ కంపెనీ తమ ఉద్యోగులకు సెప్టెంబర్ 13న సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అదేరోజు Apple  స్పెసల్​ ఈవెంట్​ ఉంటుందని, కొత్త మెడల్​ ఫోన్లని లాంచ్​ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 

- Advertisement -

ఇక.. iPhone 15 సిరీస్‌లో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro.. iPhone 15 Pro Max వంటి మోడల్​ ఫోన్లు ఉంటాయి. ప్రో మోడల్‌ ఫోన్లలో మరింత అధునాతన A17 బయోనిక్ చిప్‌సెట్‌ను అమర్చినట్టు తెలుస్తోంది. అయితే.. వనిల్లా మోడల్‌లు A16 బయోనిక్ చిప్ ద్వారా రానున్నట్టు సమాచారం అందుతోంది. ప్రో మాక్స్ వేరియంట్‌లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ కూడా ఉంటుందని లీకులు అందుతున్నాయి.

ఐఫోన్ 15 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చాలామంది భావిస్తున్నారు. లాంచ్​ ఈవెంట్​ జరిగిన కొన్ని వారాల తర్వాత కొత్త మోడల్​ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, ఇవి ఐఫోన్​ –15 గురించి వస్తున్న లీకులు మాత్రమే అని చాలామంది టెక్​ అనలిస్టులు అంటున్నారు. Apple ఇంకా iPhone 15 సిరీస్ గురించి ఎటువంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement