Friday, November 22, 2024

APP vs BJP – రేపు అంద‌రం బిజెపి వ‌స్తాం…ద‌మ్ముంటే అరెస్ట్ చేసుకోండి… అర‌వింద్ కేజ్రీవాల్

ఢిల్లీ – ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారు. దీనిపై స్వాతి ఇచ్చిన పిర్యాదుతో పోలీస్ ను నేడు బిభ‌వ్ కుమార్ ను అరెస్ట్ చేశారు.. దీనిపై ఆ పార్టీ అధినేత , ఢిల్లీ సిఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు..

” మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ని ఒక్కోక్కరిగా జైల్లో పెట్టి ప్రధాని మోదీ, ఆట ఆడుతున్నారు, నేను నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాని వస్తాం, మీరు ఎవరిని జైలులో పెట్టాలనుకుంటే, వారందరికి ఒకే సారి అరెస్ట్ చేయవచ్చు” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

”సంజయ్ సింగ్‌ని జైల్లో పెట్టారు. ఈ రోజు నా సహాయకుడిని(బిభవ్ కుమార్) జైలులో పెట్టారు. ఇప్పుడు రాఘవ్ చద్ధా లండన్ నుంచి తిరిగి వచ్చాడు, అతడిని కూడా జైల్లో పెట్టండి. సౌరభ్ భరద్వాజ్‌ని, అతిషిని జైల్లో పెడుతామని చెబుతున్నారు” అని కేజ్రీవాల్ ఎక్స్ వేదిగా ఒక వీడియోను ట్వీట్ చేశారు. అధికార పార్టీ ఆప్ నేతలందర్ని ఎందుకు జైల్లో పెట్టాలనుకుంటుంది..? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడం, మొహల్లా క్లినిక్‌లని సృష్టించడం, మందులు, వైద్యం అందించడం మా తప్పు అని అన్నారు. తమ నేతల్ని జైలులో పెట్టి ఆప్‌ని తొక్కేయాలని బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌ని ఎవరూ నలిపేయలేరు, ఇప్పుడు ఆప్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న ఆలోచన అని కేజ్రీవాల్ అన్నారు.

- Advertisement -

బిభ‌వ్ కు ముంద‌స్తు బెయ‌ల్ నిరాక‌ర‌ణ ..

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ కేసులో సీఎం కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అరెస్ట్ తర్వాత ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. అదనపు సెషన్స్ జడ్జి సుశీల్ అనుజ్ త్యాగి ఈ పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో బిభవ్ కుమార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

బిభవ్ కుమార్‌ను సాయంత్రం 4:15 గంటలకు అరెస్ట్ చేసినట్లు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ న్యాయమూర్తికి తెలియజేశారు. అనంతరం పిటిషన్‌ను కొట్టివేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని బిభవ్ కుమార్ తరపు న్యాయవాది హరిహరన్ కోర్టుకు చెప్పారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి వచ్చి బిభవ్ కుమార్‌ను తీసుకెళ్లారని.. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేషన్‌లోనే ఉన్నారని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేసినందుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement