Sunday, November 24, 2024

హీరో రానాకి క్ష‌మాప‌ణ‌లు.. మీ ల‌గేజ్ వీలైనంత త్వ‌ర‌గా అందిస్తాం.. ఇండిగో ఎయిర్ లైన్స్

ఎట్ట‌కేల‌కు హీరో రానికి ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ క్ష‌మాప‌ణ‌లు తెలిపింది. లగేజ్‌ మిస్‌ విషయమై ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్‌ మిస్‌ అయిందని, స్టాఫ్‌ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదంటూ ఘాటుగా స్పందించారు. ఈ విషయమై రానాకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. ‘సర్, మీ లగేజ్‌ మీతో పాటు విమానంలో రాకపోవడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాం.

మీ లగేజ్ మీకు వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇందుకోసం మా బృందం పని చేస్తోంది’ అంటూ ఇండిగో సంస్థ ట్వీట్‌ చేసింది.ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. విమానాశ్రయంలో చెక్‌ ఇన్‌ అయ్యాక బెంగళూరు సర్వీసు ఆలస్యమవుతుంది, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. లగేజ్‌ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజ్‌ మాత్రం రాలేదు. ఈ విషయమై విమానాశ్రయ సిబ్బందిని రానా ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అక్కడున్న ఉన్నతాధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement