ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ కేఫ్‌లో పేలుడుకు పాల్పడింది కృష్ణగిరి ఫారెస్ట్‌లో శిక్షణ పొందిన వ్యక్తి అని మంత్రి శోభ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పట్ల ఆమె తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఆమె తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తమిళ సోదరులు, సిస్టర్స్‌కు ఓ విషయాన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నామని, తాను సదుద్దేశంతో కొన్ని వ్యాఖ్యలు చేశామనని, కానీ ఆ వ్యాఖ్యలు కొందరికి బాధను కలిగించాయని, రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్‌తో లింకున్న వ్యక్తి కృష్ణగిరి ఫారెస్ట్‌లో శిక్షణ పొందినట్లు ఆమె వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో తమిళనాడు ప్రజలు ఎవరైనా బాధపడితే, తన గుండెల లోతు నుంచి క్షమాపణలు చెబుతున్నానని, ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.తమిళనాడు సీఎం స్టాలిన్‌పై కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. హిందువులు, బీజేపీ వర్కర్లను టార్గెట్ చేసే విధంగా రాడికల్స్ ను సీఎం ప్రోత్సహిస్తున్నట్లు ఆమె ఆరోపించారు.