రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయితేజ్ కాలర్ బోన్‌కు శస్త్రచికిత్స చేసే విషయంలో అపోలో వైద్యులు ఈ రోజు నిర్ణయం తీసుకోనున్నారు. సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు.. ప్రమాదంలో శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని ఇప్పటికే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల ఫలితాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం కాల్‌బోన్ శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండిః గుజరాత్ కొత్త సీఎం ఎవరు?