దేశీయంగా ఆడాల్సిన క్రికెట్ మ్యాచ్‌లపై చర్చించేందుకు గురువారం బీసీసీఐ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. కోవిడ్ కారణంగా వాయిదా పడిన రంజీ మ్యాచ్‌లను కూడా పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు చర్యలపై చర్చించనున్నారు.
ముఖ్యంగా కౌన్సిల్లో 12 ప్రధాన అంశాలపై సమావేశం నిర్వహిస్తారు. క్రికెట్ బోర్డు మార్గదర్శకాలను బిసిసిఐకి లోబడి ఉండేలా నిర్ణయిస్తారు. ముఖ్యంగా అంపైర్ల ప్రమాణాలు, వారి ఎంపికపై కూడా నిర్ణయాలు జరుగుతాయి. క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర ఒలంపిక్ క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.