Thursday, January 9, 2025

AP – ఒకే రోజు రూ.2లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం – రాష్ట్ర ప్రగతికి సోపానం: చంద్రబాబు

విశాఖలో ప్రధాని మోదీ సభరాష్ట్రానికి ఇవాళ చరిత్రలో మిగిలిపోయే రోజన్న సీఎం చంద్రబాబు ఇలాంటి శుభదినం తన జీవితంలో, రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిదని వెల్లడి ఇవాళ విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న రోడ్ షో అదిరిపోయిందని, బ్రహ్మాండంగా జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

.ఈ రోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు అని అభివర్ణించారు. ప్రధాని చేతుల మీదుగా రూ.2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం అని వెల్లడించారు. ఇలాంటి శుభదినం నా జీవితంలో, ఆంధ్రరాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో అండగా ఉన్న ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

“చిరకాల వాంఛ అయిన విశాఖ రైల్వే జోన్ కు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి ఆశీస్సులతో విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం రూ.1877 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. కృష్ణపట్నం వద్ద క్రిష్ సిటీ కోసం రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. రూ.6,177 కోట్లతో ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేస్తున్నాం.

మా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలే అయింది. ఎన్నికలయ్యాక మోదీ మొదటిసారిగా రాష్ట్రానికి వచ్చారు. రావడంతోనే రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారంటే… ఆంధ్ర రాష్ట్రమంతా వినిపించేలా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించాలి. అనునిత్యం అండగా నిలుస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ. మోదీ అభిమానం ఉత్తరాదికే పరిమితం అని కొందరు మాట్లాడుతున్నారు… కానీ దేశం, ప్రపంచం మొత్తం మెచ్చే నాయకుడు ప్రధాని మోదీ.

మొన్నటి ఎన్నికల్లో మోదీ, మిత్రుడు పవన్ కల్యాణ్, నేను కలిశాం. నేను నాలుగున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత భారీ స్థాయిలో గెలవలేదు. 93 శాతం స్ట్రయిక్ రేట్, 57 శాతం ఓట్లేశారు, 175కి 164 సీట్లు గెలిచాం. 25కి 21 పార్లమెంటు సీట్లు గెలిచాం. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఏపీలో ఈ కాంబినేషన్ ఉంటుంది…

దేశ రాజకీయాల్లో మోదీనే ప్రధానిగా ఉంటారు. ఇటీవల హర్యానాలో, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి… ఈ రెండు చోట్ల ఎన్డీయే కూటమి తిరుగులేని విజయం సాధించింది. రేపు ఢిల్లీ ఎన్నికలు వస్తున్నాయి…. రాసిపెట్టుకోండి…. ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీయే. దానికి కారణం నరేంద్ర మోదీ. దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ వెంట నిలుస్తారు. ఇందుకు ఇవాళ్టి సభలో మోదీ మోదీ నినాదాలే అందుకు నిదర్శనం. సంస్కరణలు, సుపరిపాలనతో దేశాన్ని మోదీ ముందుకు తీసుకువెళుతున్నారు.

పీఎం కిసాన్ కింద రైతులకు ఏడాది రూ.6 వేలు ఇస్తున్నారు. కొవిడ్ సమయంలో ప్రారంభించిన రూ.5 కేజీల బియ్యం పథకాన్ని ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, గతి శక్తి వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇళ్లు లేని కోట్లాది పేదలకు ఇళ్లు కట్టించారు. జనవరి 1న ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నేను రైతులతోనే ఉంటాను అని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీ.

నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా పథకం అమలు చేస్తున్నారు. రూ.3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగించాలని క్యాబినెట్ లో నిర్ణయించారు. పేదల కోసం పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి పథకాలు తీసుకువచ్చారు. ఎవరి ఇంటిపై వారే సౌర శక్తిని ఉపయోగించుకుని కరెంటు తయారుచేసుకునే పథకాలు ఇవి. భవిష్యత్తులో కరెంటు చార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచే పథకాలు తీసుకువచ్చారు

M. ఇవన్నీ ఏడు నెలల్లో చేయగలిగారు. వారి విధానం… సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్… ఇదే నినాదంతో ముందుకు వెళుతున్నారు.

.

2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే, ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది. 2029కి మూడో స్థానంలోకి వచ్చే భారతదేశం… 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థికవ్యవస్థగా ఎదుగుతుంది. ఇది వేరేవాళ్లకు సాధ్యం కాదు… ఒక్క నరేంద్ర మోదీకే సాధ్యం. మన రాష్ట్రానికి వస్తే… విభజన జరిగినప్పుడు న్యాయం జరగలేదని చెప్పి, న్యాయం చేయాలని చర్యలు తీసుకున్న వ్యక్తి మోదీ. పోలవరం పూర్తి కావాలంటే తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలని చెప్పి, ఆ ఏడు మండలాలు ఇచ్చిన తర్వాతే పార్లమెంటు సమావేశాలు పెట్టిన వ్యక్తి మోదీ.

2014-19లో ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్స్, ట్రైబల్ వర్సిటీ, సెంట్రల్ వర్సిటీ… ఇవన్నీ నరేంద్ర మోదీ నాయకత్వంలోనే వచ్చాయి. ఏపీలో అనేక పథకాలు తీసుకువచ్చాం. త్వరలోనే మెగా డీఎస్సీ ఇంటర్వ్యూలకు పిలుస్తాం. ఇవన్నీ కాకుండా సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి చేసే బాధ్యత ఎన్డీయే సర్కారు తీసుకుంటుంది. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి… అన్నింటినీ అధిగమిస్తాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకెళతాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అటు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మన బ్రాండ్ ఇమేజి పెంచుకుంటున్నాం. దేశానికి ముంబయి ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో, విశాఖ మన రాష్ట్రానికి ఆర్ధిక రాజధాని.

ఇవాళ అరకు కాఫీ వరల్డ్ ఫేమస్ అయిందంటే మన ప్రధాని చూపించిన చొరవే కారణం. మోదీ సర్… మీరే నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి. నాడు అమరావతికి మీరు శంకుస్థాపన చేశారు. ఆనాడు ఎక్కడ అమరావతి ఆగిపోయిందో అక్కడ్నుంచే ముందుకు తీసుకెళుతున్నాం. కలను నిజం చేస్తాం” అని చంద్రబాబు వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement