విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-ఎలో గుజరాత్-ఆంధ్రప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు 81పరుగులు తేడాతో విజయం సాధించింది. ఏపీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ వరుసగా రెండో భారీ శతకంతో చెలరేగిపోయాడు. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుని ఏపీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ ఓపెనింగ్ జోడీ జ్ఞానేశ్వర్ (1), అశిన్ హెబ్బార్ (8) శుభారంభాన్ని అందించడంలో విఫలమయ్యారు. ఈక్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఏపీ కెప్టెన్ శ్రీకర్ భరత్ మరోసారి సత్తా చాటాడు. 138బంతుల్లో 16ఫోర్లు, 7సిక్సర్ల సాయంతో 156పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. శ్రీకర్ భరత్‌కు అండగా గిరినాథ్‌రెడ్డి 53బంతుల్లో ఓ ఫోరు, 2సిక్సర్లతో 34పరుగులు చేసి అండగా నిలవగా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో 253పరుగులు చేసి ఆలౌటైంది.
గుజరాత్ బౌలర్లలో తేజస్‌పటేల్ 2వికెట్లు తీయగా చింతన్, హెమాంగ్ పటేల్, సిద్ధార్థ్ దేశాయ్, చావ్లా తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 254పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన 172పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఉమాంగ్ కుమార్ 66బంతుల్లో 5ఫోర్లు, ఓ సిక్స్‌తో 55పరుగులు చేసి అర్ధశతకంతో రనట్ అవగా, ఓపెనర్ కధన్ పటేల్ 54బంతుల్లో 9ఫోర్లుతో 48పరుగులు చేసి మనీష్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. మొత్తంమీద గుజరాత్ 41.3ఓవర్లలో 172పరుగులు చేసి కుప్పకూలింది. ఏపీ బౌలర్లలో మనీష్ 4వికెట్లు పడగొట్టగా, గిరినాథ్ 2వికెట్లు తీశాడు. స్టీఫెన్, విజయ్, రిక్కీ తలో వికెట్ దక్కించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital