న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నగ్న వీడియో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ హిందూపురం ఎంపీపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ విమెన్’ పేరుతో ఢిల్లీ యాత్ర చేపట్టిన మహిళా నేతల బృందం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను కలిసింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతిని ఆయన నివాసంలో కలిశారు. నగ్న వీడియోతో కలకలం రేపిన ఎంపీ మాధవ్‌పై పారదర్శక విచారణకు ఆదేశించాలంటూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ‘డిగ్నిటీ ఫర్ విమెన్’ జేఏసీ బృందంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. చెన్నుపాటి కీర్తి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత సుంకర పద్మశ్రీ, ఐద్వా ప్రతినిధి ఎస్. పుణ్యవతి, పి. రాణి (NFIW), తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరుగనగరి, ఆ పార్టీ నేతలు ముల్పురి నాగ కళ్యాణి, అన్నాబత్తుని జయలక్ష్మితో పాటు ఏపీ స్టేట్ కుర్బ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి సవిత ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement